అనంతలో విద్యార్థి అదృశ్యం.. అసలు ఏం జరిగిందంటే.. (వీడియో)

by Mahesh |   ( Updated:2024-06-02 15:17:03.0  )
అనంతలో విద్యార్థి అదృశ్యం.. అసలు ఏం జరిగిందంటే.. (వీడియో)
X

దిశ, ఏపీ బ్యూరో : అనంతపురం జిల్లాలో పోలీసు లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి అదృశ్యం అయ్యారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి జయలక్ష్మి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఇంటి సమీపంలో స్పెషల్ పార్టీ పోలీసులు మఫ్టీలో మొహరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జయలక్ష్మి అదృశ్యంపై పోలీసులను విద్యార్థి సంఘాల నేతలు నిలదీయగా తమకు ఏమీ తెలియదని వారు చెప్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

ఇంతలో జయలక్ష్మి వీడియో రిలీజ్ చేసింది. తాను అదృశ్యమవ్వలేదని బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు ఆ వీడియోలో స్పష్టం చేసింది. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో తన తలకు రాయి తగిలిందని దీంతో గాయపడినట్లు వీడియోలో స్పష్టం చేసింది. దీంతో చికిత్స పొందిన అనంతరం తాను తన బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. తన ఫోన్‌కు కాల్స్ ఎక్కువగా రావడంతో ఫోన్‌కూడా స్విచ్ఛాఫ్ అయ్యిందని తెలిపింది. తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని జయలక్ష్మి స్పష్టం చేసింది.

Advertisement

Next Story