తొమ్మిదవ అంతస్తు పై నుంచి దూకిన యువతి.. ఆ భారం భరించలేక!

by Sumithra |
తొమ్మిదవ అంతస్తు పై నుంచి దూకిన యువతి.. ఆ భారం భరించలేక!
X

దిశ, శేరిలింగంపల్లి : తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదిన గూడలో మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జహన్వి నేగి(17) అనే యువతి తల్లిదండ్రులు వీరేందర్ సింగ్ నేగి, సోనియా సింగ్ నేగిలతో కలిసి మియాపూర్ మదినగూడలోని మై హోమ్ జ్యువెల్‌లో నివాసం ఉంటోంది. మృతురాలు ప్రస్తుతం సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతోంది.

అయితే, చదువు విషయంలో మానసిక ఒత్తిడి అధికమై.. ఆ భారం భరించలేక సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో 9వ అంతస్తు నుండి కిందకు దూకింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే జహన్వి నేగి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story