- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడుపు నొప్పితో విద్యార్థిని మృతి
దిశ, ఖమ్మం :
విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న బీటెక్ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటన ఖమ్మం పట్టణంలోని ఆరోగ్య ఆస్పత్రిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పి.లక్ష్మిదుర్గ (23) బీటెక్ చదువుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటివద్దే ఉంటున్న ఆమెకు నేటి సాయంత్రం విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్టణంలోని ఆరోగ్య ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరీక్షించి చికిత్స అందించే క్రమంలోనే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. కాగా, చికిత్స కోసం ఇచ్చిన మత్తుమందు ఓవర్‌డోస్ వల్లే తన కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
Tags: student died, stomach pain, kammam, overdose reason, relations charges