బతుకమ్మ పండుగ నింపిన విషాదం.. కొత్తబట్టలే ప్రాణం తీశాయా ?

by Sridhar Babu |   ( Updated:2021-10-04 00:17:39.0  )
commit suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. తన చిన్ని చేతులతో బతుకమ్మను పేర్చి తీసుకెళ్లాల్సిన కూతురు అనంతలోకాలకు చేరుకుంది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అరెల్లి అఖిల డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే పండుగ సమీపిస్తున్న సందర్భంగా తాను తన స్నేహితులతో కలసి షాపింగ్ చేయాలని భావించుకుంది. పండుగకు కొత్తబట్టలు కొనుక్కుంటాను రూ.2 వేలు ఇవ్వమని తండ్రిని కోరింది. ప్రస్తుతం డబ్బులు లేవని తర్వాత ఇస్తానని తండ్రి చెప్పడంతో మనస్తాపానికి గురైన అఖిల వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, అఖిల మృతి‌తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed