ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, ముడి పదార్థాల కొరతను పరిష్కరించాలి 

by Harish |
Phd Chamber
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఆర్థిక పునరుద్ధరణ ఊపందుకోవడంతో రాబోయే త్రైమాసికాలో బలమైన జీడీపీ వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నట్టు పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) తెలిపింది. అయితే, దేశంలో వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులకు మద్దతుగా అధికంగా ఉన్న వస్తువుల ధరలను, ముడిపదార్థాల కొరతను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు ప్రదీప్ ముల్తానీ అన్నారు. జీఎస్టీ వసూళ్లు, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, యూపీఐ లావాదేవీలు, ఎగుమతులు, రూపాయి మారకం విలువ, ఫారెక్స్ నిల్వలు, సీపీఐ ద్రవ్యోల్బణం, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు లాంటి అంశాల్లో ఆగష్టు కంటే సెప్టెంబర్‌లో సానుకూల వృద్ధి నమోదైందని పీహెచ్‌డీసీసీఐ వివరించింది.

ముఖ్యంగా నిరుద్యోగ రేటు ఆగష్టులో 8.3 శాతం నుంచి సెప్టెంబర్‌లో 6.9 శాతానికి మెరుగుపడింది. జీఎస్టీ వసూళ్లు సైతం ఆగష్టు కంటే 4.5 శాతం పెరిగి రూ. 1.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరుణంలో అధిక ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల కొరత లాంటి సరఫరా సమస్యలు ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయని దీన్ని పరిష్కరించాలని ప్రదీప్ పేర్కొన్నారు. అలాగే, దేశంలోని ప్రజల వినియోగం పెంచేందుకు, డిమాండ్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed