- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మందుల్ని బ్లాక్ చేస్తే కఠిన చర్యలు : గంగుల
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా వ్యాధి సోకిన వారికి వాడే మందుల్ని బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసకుంటామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. రెమిడిస్ వేర్ తో పాటు ఇతరాత్ర మందులను బ్లాక్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో టీకాలు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని గంగుల కోరారు.
ఫస్ట్ వేవ్ కరోనా సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి కట్టడి చేశామని, సెకండ్ వేవ్ విషయంలోనూ జిల్లా యంత్రాంగం పడ్భందీ చర్యలు చేపట్టిందని తెలిపారు. వ్యాధి మరింత ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి గంగుల వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.