ఇదేం ప్రేమరా బాబు.. ప్రియురాలిని 10 ఏళ్లు ఒకే గదిలో ఉంచి

by Anukaran |   ( Updated:2021-06-10 03:04:56.0  )
ఇదేం ప్రేమరా బాబు.. ప్రియురాలిని 10 ఏళ్లు  ఒకే గదిలో ఉంచి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ కథలు ఎప్పుడు స్పెషల్ గానే ఉంటాయి. ప్రేయసి కోసం ప్రియుడు ఎదురు చూడడం, ప్రియుడి కోసం ప్రేయసి ఇంట్లో వారిని ఎదిరించడం, బయటికి వెళ్లిపోవడం ఇలాంటివన్నీ రోజు వింటూనే ఉంటాం. కానీ కొన్ని ప్రేమ కథలు విన్నప్పుడు.. ప్రేమ కోసం ఇంతకూ తెగిస్తారా..? అని అనిపించక మానదు. తాజాగా కేరళలో వెలుగుచుసిన ఓ వింత ప్రేమ కథ సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే..

కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్మర పోలీస్ స్టేషన్ పరిధిలోని అయిరూర్ గ్రామంలో నివసిస్తున్న ఓ టీనేజీ అమ్మాయి (18) 2010 లో ఇంటి నుంచి పారిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. చుట్టూ పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లు అన్నీ వెతికి అలిసిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా పోలీసుల విచారణలోనే పదేళ్లు గడిచిపోయాయి. తమ కూతురు ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అనుకున్న వారు ఇక రాదు అనే స్థాయికి వెళ్లిపోయారు. అసలు ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నట్టు.. అనేది పోలీసులకు కూడా అంతుచిక్కని ప్రశ్న గా మారింది. అయితే సడెన్ గా 2021 జూన్ లో పోలీసులకు ఆ అమ్మాయి గురించిన వివరాలు తెలిశాయి. ఆ అమ్మాయి పక్కన మరో అబ్బాయిని పట్టుకున్న పోలీసులు వారు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు.

దాదాపు 11 ఏళ్లు అవుతోంది. అందరూ ఆమె గురించి మరిచిపోయారు. పారిపోయినప్పుడు ఆమె వయసు 18 ఏళ్లు కాగా.. ఇప్పుడు 29. ఇంతకీ ఈమె ఎక్కడ ఉన్నదంటే.. తన ఇంటికి కొద్దీ దూరంలో ఉన్న ప్రియుడు ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఆమె ఉన్నట్లు ప్రియుడి తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం విశేషం. ప్రియుడు ఇంట్లో ఒక రహస్య గదిలో ఆమె పదేళ్లు ఎవరికి తెలియకుండా జీవనం సాగించింది. అంత చిన్నరూమ్ , కనీసం బాత్ రూమ్ కూడా లేని ఆ రూమ్ లో ఆమె పదేళ్లు ఎలా గడిపింది అంటే .. ప్రియుడే ఆమె యోగక్షేమాలు చూసుకునేవాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే లోపల గడియ పెట్టుకునే వాడు. లేకపోతే.. బయట తాళం వేసేవాడు. అయితే.. ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట. ఇలా పదేళ్లు గడిచాయి.

ఇక చివరికి ప్రియుడి వాళ్ళింట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువ కావడంతో కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ పారిపోయి సహజీవనం చేయడం మొదలు పెట్టారు. తన కొడుకు కనిపించడం లేదని అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతని కోసం గాలింపు చర్యలు చేపడితే ఈ మొత్తం భాగోతం బయట పడింది. అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులుకు మళ్లీ షాక్ తగిలింది. తాను ప్రేమించినవాడితోనే ఉంటానని యువతి కోర్ట్ కెక్కింది. దీంతో యువతి మేజర్ కావడంతో ప్రేమికుడితో వెళ్లేందుకు ఆమెను అనుమతించారు.

Advertisement

Next Story