కాంగ్రెసొళ్లు కానొస్తరా!

by Shyam |   ( Updated:2020-03-06 06:44:50.0  )
కాంగ్రెసొళ్లు కానొస్తరా!
X

దిశ, వెబ్‌డెస్క్: అబ్బర వాయిర వంట… ! గి ‘కారు’ పార్టొళ్లు రెండుసార్లు గెలిస్తే రెండుసార్ల కాంగ్రెస్‌ను కండ్లళ్ల కారం పెట్టి కొట్టినట్టే జేసుర్రు పో. లేకపోతే ఏంది నూరేండ్ల చరిత్ర కలిగిన పార్టొళ్లు, దేశంల ఎక్వరోజులు అర్సుకొని గింతవరకు తీస్కొచ్చినొళ్లకు కనీసం కూసుంటానికి సోటు లేకుండా జేసింరంటే మామూలు మాటల. గటు పెద్దసారు మోడాయే, గిటు కేసీఆర్ సారాయే.. ఇద్దరు ఇద్దరేనాయే. ఇగ ఎటూ నెగిలేటట్లు లేకుంటాయే పరిస్థితి. తెలంగాణ వచ్చినంక మొదుగాల ఓట్లప్పుడు చేయిగుర్తొళ్లు 20మందికి పైగ గెలిస్తే సగం బడ ఉర్కొచ్చి కార్లనే కూసుండిరి. గిప్పుడు మళ్ల 19 మంది వరకు గెలిస్తే పన్నెండు, పదమూడు మందొచ్చి మల్ల కార్లనే జొరబడిరి. ఇగ యాడుంటరు యాడ కానొస్తరు.

గిదంత పక్కకు ఉంచి ఇగ అసెంబ్లీల ముచ్చట్ను మాట్లాడుకుంటే చేయి గుర్తొళ్లను చూస్తే నవ్వుకంటే ఎక్వ బాధే అనిపిస్తుంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది ఉత్తి ఆరుగురే. అసెంబ్లీ సురువయ్యే సరికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంత చీమలపుట్ట పగిలినట్లుగా వచ్చి సభలో కూలబడిరి. మొత్తం పింక్ తువాళ్లు ఏస్కొని వచ్చేసరికి అసెంబ్లీ గూడ చిన్నపాటి కారు పార్టీ సభ లెక్కనే కనపడవట్టే. వీళ్లందరి నడిమిట్ల అటు పతంగి పార్టొళ్లు కొద్దిగ కనపడ్డట్టు జేసినా చేయిగుర్తు సార్లు ఎక్కడ ఉన్నరో ఎవ్వల్కి కూడా కనపడ్లేదు. గవర్నర్ మేడం మాట్లాడుతున్నప్పుడు కెమెరా అటు ఇటు తిర్గిన మల్ల చివర్కు పోయి కేసీఆర్ సారు, గవర్నర్ మేడమే కనపడ్డరు తప్ప అసలు కాంగ్రెస్ సార్లు మీటింగ్‌కు వచ్చిర్రా రాలేదా అన్నకాడికి పోయింది.

కాంగ్రెస్‌ల ఉన్నది భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, గాబట్టి ఎక్కడ్నో పోయి కూసున్నాళ్లే పాపం.. లేకుంటే సభకు వచ్చిర్రరో రాలేదో అనుకున్నరు టీవీలు జూసే జనాలంత. సరే ఇయ్యాట్కి అయితే అయిపోయింది గాని రేపట్నుంచి సభల మల్ల ఎడ కూసొని ఎసొంటి ప్రశ్నలు అడుగుతరో.. గీళ్లు అడిగే ప్రశ్నలతోపాటు, లొల్లిపెడితే సభల ఉంచుతర లేదా అన్న గుంజాయితి గూడ జనాళ్ల నోళ్లళ్ల ఇయ్యాల బాగా మెదిలింది. ఎక్వ లొల్లిగిట్ట జేస్తే స్పీకర్ సారు ఎల్లగొడుతడు గాబట్టి సభ ఉన్నంత సేపు అసెంబ్లీల కానొస్తర లేద అన్నది సూడాలి. గంతే..

tags : Telangana Congress Mlas, TRS, KCR, Assembly, TRS MLAs

Advertisement

Next Story