- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ జెండాలు వాడొద్దు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన త్రివర్ణపతకాలను ప్రజలు వాడకుండా చూడాలని రాష్ర్టాలను కేంద్ర హోంశాఖ కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, సంస్థలు పాటించాలని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్ తో కాకుండా పేపర్ తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది. ప్లాస్టిక్ జెండాలు పేపర్ వాటిలా పర్యావరణంలో కలిసిపోవని, అలాగే బయటపడవేయడం సరైన చర్య కాదని పేర్కొంది. ముఖ్యమైన జాతీయ,సాంస్కృతిక కార్యక్రమాలలో ఫ్లాగ్ కోడ్ ఆప్ ఇండియా-2002 ప్రకారం పేపర్ తో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలంది.