మున్సిపల్​ ఎన్నికలను ఆపండి..

by Shyam |
Shabbir Ali in court
X

దిశ, తెలంగాణబ్యూరో : రాష్ట్రంలో ఈ నెల 30న జరుగనున్న కార్పొరేషన్​, మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని కాంగ్రెస్​ నేత షబ్బీఆర్​ అలీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇప్పటికే ఓసారి కోర్టులో దీనిపై పిటిషన్​ వేయగా… రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని, హైకోర్టు జోక్యం చేసుకోదంటూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఎస్ఈసీ కూడా ప్రభుత్వాన్ని సలహా అడిగింది. ప్రభుత్వం నుంచి కూడా పుర ఎన్నికలను యథాతధంగా నిర్వహించాలని సూచించింది. దీంతో ఎన్నికలపై ఎస్ఈసీ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్​నేత కోర్టుకెక్కారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్అలీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కాగా, లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విజ్ఞప్తి చేసుకోవాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు అనుమతి ఇవ్వకపోవడంతో షబ్బీర్ అలీ రెగ్యులర్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story