- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ ఆసుపత్రిలో దారుణం
దిశ, న్యూస్‌బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్‌తో ఓ రోగి ఉదయాన్నే చనిపోయాడు. ఐతే అన్ని విభాగాల ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది సామూహిక సమ్మెతో ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బెడ్ మీదనే మృతదేహం పడి ఉండడం గమనార్హం. 8గంటల పాటు మృతదేహాన్ని తరలించలేదని సమాచారం. దాంతో కరోనా వార్డులో దుర్వాసన వ్యాపించింది. దుర్వాసన భరించలేక రోగులు వార్డు ఖాళీ చేసినట్లు తెలిసింది. పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఐతే ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు స్పష్టతనిచ్చారు. డెత్ డిక్లేర్‌లో ఆలస్యం జరిగిందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చనిపోయాడని, ఐతే ఉద్యోగుల సమ్మె కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. మృతదేహాన్ని క్లియర్ చేయడానికి 8 గంటలు పట్టిందనడంలో నిజం లేదన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పని చేస్తున్నారన్నారు.