- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ కప్ ఆడటమే లక్ష్యం : శ్రీశాంత్
దిశ, స్పోర్ట్స్: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ నుంచి నిషేధానికి గురైన కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో శిక్షను పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పటికే అతడిని కేరళ రంజీ జట్టులోకి తీసుకోవాలని కేఏసీ భావిస్తోంది. కాగా, 2023 ప్రపంచ కప్ ఆడటమే తన లక్ష్యమని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. ఇది వినడానికి మీకందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ తనకు ఆ నమ్మకం ఉందని శ్రీశాంత్ దీమా వ్యక్తం చేశాడు. కేరళ రంజీ జట్టు కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్ పేరు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే ఆ జట్టు కోచ్ టిను యోహానన్ చెప్పారు. దీంతో శ్రీశాంత్ తిరిగి క్రికెట్ మైదనానంలోకి అడుగుపెట్టడం లాంఛనమే కానుంది. ఇతడు రంజీ సీజన్‌లో నిలకడగా రాణిస్తే అప్పుడు ఇండియా-ఏ టీమ్‌కి ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా, 37 ఏళ్ల శ్రీశాంత్ దాదాపు ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2023కి అతడికి 40 ఏండ్లు వస్తాయి. మరి అప్పటికి అతను క్రికెట్ ఆడే ఫిట్‌నెస్ కలిగి ఉంటాడా? భారత క్రికెట్ జట్టులో అందరూ యువకులే ఉంటున్న స్థితిలో ఇంత వయసున్న అతడిని ఎంపిక చేస్తారా అనేది అనుమానమే. కానీ, ఏదేమైనా శ్రీశాంత్ మాత్రం తప్పకుండా ప్రపంచ కప్ ఆడతాననే విశ్వాసంతోనే ఉన్నాడు.