- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పతనమైన కోహ్లీ ర్యాంక్.. మొదటి స్థానం అతడిదే..!
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రెండో స్థానానికి పడిపోయాడు. లుబుషేన్ మూడో ర్యాంకులో కొనసాగుతుండగా.. కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఐదో స్థానానికి పడిపోయాడు. ఇటీవల ఇంగ్లాండ్, న్యూజీలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో జో రూట్ విఫలమయ్యాడు. కేన్ విలియమ్‌సన్ కూడా ఒకే మ్యాచ్ ఆడి 13 పరుగులకే అవుటయ్యాడు. ఐసీసీ వీరిద్దరి రేటింగ్ పాయింట్లకు కోత పెట్టడంతో ర్యాంకులు కోల్పోయారు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇద్దరూ 6వ ర్యాంకులో కొనసాగుతున్నారు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ 64 స్థానానికి చేరుకున్నాడు. డబుల్ సెంచరీ చేసిన డెవాన్ కాన్వే 61వ ర్యాంకు సాధించాడు. బౌలర్లలో పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, టిమ్ సౌథీ టాప్ 3 ర్యాంకులో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా 2, అశ్విన్ 4వ స్థానంలో ఉన్నారు.
ఐసీసీ టాప్ 5 టెస్టు ర్యాంకులు
బ్యాట్స్‌మాన్
1. స్టీవ్ స్మిత్ (891)
2. కేన్ విలియమ్‌సన్ (886)
3. మార్నస్ లబుషేన్ (878)
4. విరాట్ కోహ్లీ (814)
5. జో రూట్ (797)
బౌలర్లు
1. పాట్ కమిన్స్ (908)
2. రవిచంద్రన్ అశ్విన్ (850)
3. టిమ్ సౌథీ (830)
3. జోష్ హాజెల్‌వుడ్ (816)
4. నీల్ వాగ్నర్ (815)
ఆల్ రౌండర్లు
1. జేసన్ హోల్డర్ (412)
2. రవీంద్ర జడేజా (386)
3. బెన్ స్టోక్స్ (377)
4. రవిచంద్రన్ అశ్విన్ (353)
5. షకీబుల్ హసన్ (338)