- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేలానికి స్టీవ్ జాబ్స్.. జాబ్ అప్లికేషన్
దిశ, ఫీచర్స్: 1976లో స్టీవ్ జాబ్స్, వోజ్నియాక్‌తో కలిసి ఆపిల్ కంపెనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందుగా 1973లోనే స్టీవ్ జాబ్స్ ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ దరఖాస్తులో ఏ డిజిగ్నేషన్ కోసం అప్లయ్ చేస్తున్నాడో ప్రస్తావించలేదు. అంతేకాదు సంస్థ పేరును కూడా అందులో పేర్కొనలేదు. కాగా అప్పటి జాబ్ అప్లికేషన్‌ను ప్రస్తుతం వేలం వేయనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 24 వరకు ఆన్‌లైన్ వేలం నిర్వహించనుండగా.. అసలు ఆ అప్లికేషన్‌లో ఏముంది? ఎంత ధర ఉండొచ్చు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టీవ్ జాబ్స్ తన స్వదస్తూరితో రాసిన దరఖాస్తులో ‘కంప్యూటర్స్ అండ్ కాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ టెక్ ఆన్ డిజైన్ ఇంజనీర్’లో తనకు ప్రత్యేక సామర్థ్యాలున్నాయనే విషయాన్ని హైలైట్ చేశాడు. 1973 లో రాసిన ఈ లేఖలో జాబ్స్ దరఖాస్తు చేస్తున్న కంపెనీ పేరు పేర్కొననప్పటికీ, ఈ అప్లికేషన్ రీడ్ కాలేజీ అడ్రస్‌తో ఉంది. ఆ తర్వాత అతను అటారి ఇంక్ అనే సంస్థలో టెక్నీషియన్‌గా చేరాడు. ‘స్టీవ్ చేసిన ఉద్యోగం కష్టమైంది కానీ విలువైంది. అతడు చాలా చురుకైన, తెలివైన వ్యక్తి. తన పనితనంతోనే ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రూవ్ చేస్తాడు’ అని ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తెలిపాడు.
స్టీవ్ జాబ్స్.. అటారి ఇంక్ సంస్థలోనే వోజ్నియాక్‌ను కలిశాడు. ఇక వేలం వేస్తున్న దరఖాస్తు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండగా, దానికి చివరంచులకు టేప్ చుట్టారు. కాగా సీవ్ జాబ్స్ సంతకం చేసిన ఈ దరఖాస్తును చార్టర్ ఫీల్డ్స్ ఆక్షన్ వెబ్‌సైట్‌లో వేలానికి ఉంచారు. అయితే ఈ దరఖాస్తును 2018లోనూ వేలం వేశారు. ఆ సమయంలో వేలం నిర్వాహకులు దీనికి 50 వేల డాలర్లు వస్తుందని అంచనా వేయగా, ఇంగ్లండ్‌కు చెందిన ఓ సంస్థ 174 వేల డాలర్లు వెచ్చించి ఈ జాబ్ అప్లికేషన్‌ను దక్కించుకుంది. అప్పుడు బోస్టన్‌కు చెందిన ఆర్‌ఆర్ ఆక్షన్ ఆన్‌లైన్‌లో ఈ వేలాన్ని నిర్వహించింది.
Petición de empleo de Steve Jobs (1973).
Especialidad: literatura inglesa.
Habilidad: ordenador, calculadora, diseño y tecnología.
Habilidad especial: electrónica y técnico o ingeniero de diseño digital.En 1974 entró en Atari y trabajó con Steve Wozniak.
Fundó Apple en 1976. pic.twitter.com/gpbEY9obhE— David Bernal Raspall (@david_br8) February 15, 2021