- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలా.. జాగ్రత్త! దళితుల జోలికొస్తే ఉరికించి కొడుతాం : టి. రాజయ్య
దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : ఏడేళ్లు అధికారాన్ని అనుభవించి, అదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని దళితులు, దేవాలయాల భూములను కబ్జా చేసి ఆత్మగౌరవం పేరుతో బయటికు వచ్చిన ఈటల రాజేందర్ దళిత ద్రోహి అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందే ఫిబ్రవరి 10న దళిత బంధు పథకాన్ని ప్రకటించి ఏప్రిల్ 14న అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ దళిత బంధు పై అడ్డమైన కూతలు కూస్తున్న గోనె ప్రకాశ్ రావు, పద్మనాభరెడ్డిలకు సిగ్గు, శరం లేదన్నారు. దళితుల పట్ల అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడుతున్న ఆ ఇద్దరి పై సుమోటో కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అఖిలపక్షం, దళిత సంఘాల నాయకులతో చర్చించి ప్రతీసారి ఆనవాయితీగా వస్తున్న కరీంనగర్ నుంచే దళిత బంధు ప్రారంభిస్తాం అనగానే ఈటల రాజేందర్‌కు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈటలకు కొమ్ముకాస్తున్న మధుసూదన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని లేదంటే దళితులు ఉరికించి కొడుతారని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్, దండోరా ఉద్యమాలను చీల్చేందుకు ఈటల శకుని పాత్ర పోషించాడని ఆరోపించారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్, ఎంపీటీసీలు రాజు, దయాకర్, వెంకటస్వామి, నాయకులు లక్ష్మి, వేణు, నరేందర్, సత్యం, గట్టయ్య, ప్రసాద్, మల్లేశం, మనోహర్, రమేష్ పాల్గొన్నారు.