- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహమ్మారి వల్ల ఎగుమతులకు తీవ్ర ఇబ్బందులు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించడం వల్ల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని ఇంజనీరింగ్ ఎగుమతిదారుల సంఘం(ఈఈపీసీ) ఆదివారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం చివరి కొన్ని నెలల్లో ఎగుమతుల రంగం కోలుకోవడంతో ఈ రంగం వృద్ధిపై ఆశలు పెరిగాయని, అయితే, ఇటీవల కరోనా తీవ్రమవడం ప్రతికూల సంకేతాలను ఇస్తుందని ఇంజనీరింగ్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్(ఈఈపీసీ) పేర్కొంది. వైరస్ నియంత్రణకు చాలా రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. దీనివల్ల ఎగుమతుల రంగం ప్రభావితమవుతుంది.
ఇది ఎంఎస్ఎంఈలపై అత్యధిక ప్రభావం ఉంటుందని ఈఈపీసీ పేర్కొది. దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం టీకాలను వేగవంతం చేయడం అత్యవసరమని కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది కాలంగా మహమ్మారి వల్ల ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మధ్యనే పెరుగుతున్న ప్రపంచ డిమాండ్, పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలతో ఇనుము, ఉక్కు వంటి లోహ ఉత్పత్తులు, పారిశ్రామిక యంత్రాలు, కార్యాలయాల పరికరాల వంటి 33 ఇంజనీరింగ్ వస్తువుల విభాగలో ఎగుమతులు మార్చిలో సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.