- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ సార్.. ఆలస్యం అవుతోంది : మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై రైతులు సాగు పనుల్లో ముమ్మరంగా ఉన్నారని, ఇందుకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన రాష్ట్ర మంత్రి కృషి భవన్‌లో కేంద్ర మంత్రి సదానందగౌడను కలిసి ఈ అంశాన్ని వివరించారు. ఎరువుల సరఫరా గురించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో మాట్లాడారని పేర్కొన్న కేంద్ర మంత్రి ఈసారి 10.5 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
తెలంగాణకు కేటాయించిన 1.77 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా రాష్టానికి సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వర్షాలు సకాలంలో రావడంతో తెలంగాణ సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి అనుగుణంగా యూరియా, ఎరువుల కేటాయింపులు పెంచాలని వివరించారు. కొవిడ్ ప్రభావం అన్ని రంగాలపై పడినప్పటికీ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపలేదని వివరించారు. తెలంగాణలో సాగు విస్తర్ణం ఇంకా పెరుగుతుందని, కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని కేంద్ర మంత్రికి తెలియజేవారు.
కరోనా నేపథ్యంలో రాష్టానికి యూరియా సరఫరా ఆలస్యం అవుతుంది అని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. తెలంగాణకు కేటాయించిన 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కానీ కరోనా కారణంగా ఉత్పత్తి కర్మాగారాల్లో కూలీల కొరత ఏర్పడిందని, లోడింగ్ అన్ లోడింగ్ అంశాలకు సైతం కూలీల కొరత తీవ్రంగానే ఉందని, అందువల్లనే యూరియా సరఫరా ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.