తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు

by Shyam |
తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీ భవన్‌లో ఘనంగా జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి ఏడేండ్లు పూర్తైన సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరఫున ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story