- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెజాన్ నెలరోజుల భారీ సేల్
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పండుగ సీజన్ సందర్భంగా భారీ సేల్‌ను ప్రారంభించింది. ఇదివరకే ప్రకటించిన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2020’ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, బుధవారం ఆ సంస్థ ఈ భారీ సేల్ ముగింపు తేదీని వెల్లడించింది. ఈ నెల 17 నుంచి మొదలవనున్న గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్‌ను ఏకంగా నెలరోజుల పాటు నిర్వహించనుంది. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను ఆరు రోజులు మాత్రమే నిర్వహిస్తుండగా, అమెజాన్ నెల రోజుల వరకు నిర్వహించనుండటం విశేషం.
అమెజాన్ ఇదివరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను నిర్వహించినప్పటికీ వారం మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రకటించేది. ఈ ఏడాది కరోనా వల్ల కలిసొచ్చిన ఈ-కామర్స్ వ్యాపార డిమాండ్‌ను ఎలాగైనా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో భారీ ఎత్తున ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ..వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల ఉత్పత్తులను, వస్తువులను అందించడం కోసమే నెలరోజుల పాటు ఈ సేల్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సేల్ 17న అందుబాటులోకి రానున్నప్పటికీ, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 16 నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ సేల్‌లో స్థానిక దుకాణాల నుంచి వివిధ రకాల స్థానిక ఉత్పత్తులను అందించే లక్ష్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.