- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది మంచి నిర్ణయం
దిశ, స్పోర్ట్స్: యూఏఈలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ ప్రారంభ సమయాలను ముందుకు మార్చడం సరైన నిర్ణయమని టీం ఇండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 19నుంచి మొదలు కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లను రాత్రి 7.30 గంటలకు ( భారతీయ కాలమాన ప్రకారం) ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో 8 గంటలకు ప్రారంభం కాగా, దాన్ని అరగంట ముందుకు జరిపారు. దీనిపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానల్‌లో స్పందించారు. ‘ఐపీఎల్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవనున్నాయి. మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పు తెలివైన నిర్ణయం. 8 గంటలకు స్టార్ట్ అయ్యే మ్యాచ్‌లు సాధారణంగా రాత్రి 11.30 లేదా 11.45కి ముగుస్తాయి. దాంతో మ్యాచ్‌లు ఆఖరి వరకూ చూడటం కొంత మందికి ఇబ్బందే. ఇప్పుడు మాత్రం 11గంటలకే ముగిసే అవకాశం ఉంది’ అని చోప్రా అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మ్యాచ్ టైమింగ్స్ మార్చాలని బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మొదటి నుంచి విజ్ఞప్తి చేయడం వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.