- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌కు మేం సిద్ధమే : స్టార్ ఇండియా చైర్మన్
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌పై ఇంతవరకు బయటకు మాట్లాడని అతిపెద్ద వాటాదారు స్టార్ అండ్ డిస్నీ ఇండియా తొలిసారి నోరు విప్పింది. ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఉదయ్ శంకర్ ఐపీఎల్ భవిష్యత్తుపై మాట్లాడారు. ‘ప్రస్తుతం ఐపీఎల్ కోసం మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, బయటి వాతావరణం ప్రమాదకరం కాదని నిర్ధారించుకుంటేనే ఐపీఎల్ జరగుతుంది. ఐపీఎల్ నిర్వహణ, ప్రణాళికపై ఇప్పటికే స్టార్ ఇండియా అంతర్గతంగా పలుసార్లు చర్చలు జరిపింది. కానీ, మాకు ప్రేక్షకులు, క్రీడాకారుల ఆరోగ్యమే ముఖ్యం’ అని ఉదయ్ శంకర్ అన్నారు. చైనా వ్యతిరేక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై కూడా చర్చిస్తున్నామన్నారు. చైనా కంపెనీలు యాడ్స్ రూపంలో భారీగా ఖర్చు చేస్తున్నాయి. వాటిని మేం వద్దు అనుకుంటే అంతే భారీగా ఖర్చుపెట్టే ఇతర సంస్థలను కూడా వెతికి పట్టుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది కొంచెం కష్టమేనని ఉదయ్ శంకర్ అన్నారు. ఒకవేళ భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే స్టార్ ఇండియా కూడా ఆ దిశగా మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.