తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ : రాహుల్

by Shamantha N |   ( Updated:2021-03-28 23:19:42.0  )
Rahul Gandhi
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోటాపోటిగా అభ్యర్థలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నికవుతాడని హామి ఇస్తున్నాను అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సేలంలో ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నికవుతాడని హామి ఇస్తున్నాను అన్నారు. స్టాలిన్ ఎన్నిక లాంఛనమే అయినా, తేలిగ్గా తీసుకోవద్దని, పోరాటం ఇంకా మిగిలే ఉందని అన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పై విరుచుకపడ్డాడు. ఏ తమిళనాడు ఇష్టపడని పనిని పళనిస్వామి చేస్తూన్నారంటూ దుయ్యబట్టారు. అమిత్‌షా, మోహన్ భగవత్ వంటి వ్యక్తుల కాళ్లను తాకడానికి ఏ తమిళుడూ ఇష్టపడడని కానీ, ముఖ్యమంత్రి పళనిస్వామి వారి ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. నిజానికి వారికి లొంగిపోవడం ఈపీఎస్‌కు కూడా ఇష్టం లేదని, కానీ వారి వద్ద సీబీఐ, ఈడీలు ఉన్నాయని, దీంతో ఆయన అవినీతికి పాల్పడి వుండడం వల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో మోకరిల్లాల్సి వస్తోందని అన్నారు.

Advertisement

Next Story