- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు నెలలుగా అందని వేతనాలు
దిశ, పటాన్‌చెరు: గత తొమ్మిది సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ… రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
గత తొమ్మిదేండ్ల నుంచి 167 మంది కార్మికులు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఐదు నెలలుగా సంబంధిత కాంట్రాక్టర్ ఏజెన్సీలు జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ దిన దిన గండంగా మారిందని వారు వాపోయారు. ఇందుకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో సమస్య గురించి విన్నవించారు. ఇందుకు స్పందించిన మంత్రి త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు తెలిపారు.