స్టాఫ్ నర్సుల జాబితా రిలీజ్..

by Harish |   ( Updated:2021-04-29 11:50:44.0  )
స్టాఫ్ నర్సుల జాబితా రిలీజ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు మూడున్నరేళ్ళుగా స్టాఫ్ నర్సు పోస్టు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి వార్తను పంచింది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తం 3,311 పోస్టుల భర్తీ కోసం 2017 నవంబరులో నోటిఫికేషన్ వెలువరించిన తర్వాత ఇప్పుడు అర్హత కలిగిన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించింది. మొదటి, రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 2,418 మంది మాత్రమే అర్హత సాధించారని, మరో 893 మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని కమిషన్ గురువారం రాత్రి వెల్లడించింది. విధుల్లో చేరడానికి ఆసక్తిలేనివారు మే నెల 1వ తేదీకల్లా కమిషన్‌కు తెలియజేయాలని కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య శాఖల్లోని వివిధ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రాధాన్యత దృష్ట్యా తుది జాబితాను వెంటనే ప్రకటించామని, ఆ రెండు విభాగాలకు కూడా పంపించామని కార్యదర్శి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల కారణంగానే పోస్టుల్లో చేరడానికి ఆసక్తిలేనివారు ఆ విషయాన్ని కమిషన్‌కు తెలియజేయడానికి కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Staff_Nurse_List_final_April_29.tspsc Staff_Nurses_list_April_29.tspsc

Advertisement

Next Story