సీపీఎల్‌‌లో ఓ అనామక జట్టు!

by Shyam |
సీపీఎల్‌‌లో ఓ అనామక జట్టు!
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)ను 2013లో ప్రారంభించినప్పుడు ఆంటిగ్వా హాక్స్‌బిల్స్ (Antigua Hawksbills) అనే జట్టు ఉండేది. 2013, 2014 సీజన్ల తర్వాత ఆ జట్టును లీగ్ (League)నుంచి తొలగించారు. దీంతో 2015లో దాని స్థానంలో సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్ (St. Kitts And Nevis Patriots) అనే జట్టును లీగ్‌లో చేర్చారు. కరేబియన్ దీవుల్లోని (Caribbean Islands) సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ దేశానికి ఈ ఫ్రాంచైజీ (Franchisee) ప్రాతినిథ్యం వహిస్తున్నది.

స్వయంగా ఆ దేశ ప్రభుత్వం, మరికొంత మంది వ్యాపారవేత్తల (Businesmans)తో కలిసి ఈ జట్టును నిర్వహిస్తుండటం విశేషం. ఆడిన తొలి రెండు సీజన్ల (first two seasons)లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఈ జట్టు, అనూహ్యంగా 2017లో ఫైనల్స్‌ (Finals)కు చేరింది. కానీ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders) జట్టుతో జరిగిన ఫైనల్స్‌లో మెరుగైన ప్రదర్శన (Best performance)చేయకపోవడంతో టైటిల్‌కు ఒక్క అడుగు దూరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఫైనల్స్‌ (Finals)కు చేరలేదు. గత సీజన్‌ (Last Season)లో ఈ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.

ఒక అనామక జట్టు..

సీపీఎల్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్ (St. Kitts And Nevis Patriots) జట్టు ఒక అనామక జట్టుగానే మిగిలింది. పెద్ద స్టార్లు (Star cricketers)లేకపోవడం, ప్రభుత్వ ఆధీనంలో ఉండిపోవడంతో పెద్దగా కమర్షియల్ విలువలు (Commercial values) ఉండేవి కావు. అయితే, ఈ ఏడాది కొంతమంది వ్యాపారవేత్తలు (Businesmans) కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడులు(Franchisees investments) పెట్టి జట్టుకు సరికొత్త జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఏడాది కొత్తగా 12మంది ఆటగాళ్ల (12 players)ను జట్టు (Team)లోకి తీసుకొని అన్ని విభాగాల్లో బలోపేతం చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మాన్ క్రిస్ లిన్ (Australian batsman Chris Lynn), పాకిస్తాన్ బౌలర్ సొహైల్ తన్వీర్(Pakistan bowler Sohail Tanveer), వెస్టిండీస్ ఆటగాడు దినేష్ రామ్‌దిన్ (West Indies player Dinesh Ramdin) వంటి వారిని జట్టులోకి తీసుకున్నారు. షెల్డన్ కొర్టెల్ (sheldon cortel), అల్జారీ జోసెఫ్ (Aljari Joseph), ఇష్ సోథి (Ish Sothi)లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా తయారైంది.

ఈసారి ఫైనల్స్ (Finals) చేరడమే తమ లక్ష్యమని కెప్టెన్ రయాద్ ఎమ్‌రిత్ (Captain Ryad Emrit), కోచ్ మార్క్ ఓడెనిల్ (Coach Mark Odinil) అంటున్నారు. ఇతర జట్లలో టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ (T20 Specialist Batsmen) ఉన్నారు. ఈ జట్టులో అంతర్జాతీయ అనుభవం (International experience) ఉన్న ఆటగాళ్లు (Players)తక్కువగా ఉండటం లోపమేనని విశ్లేషకులు (Analysts) అంటున్నారు. అయితే కొత్త ఆటగాళ్లతో (new players) నిండిపోయిన ఈ జట్టు అన్ని రంగాల్లోనూ సమతూకంగా ఉందని స్పష్టం చేస్తున్నారు.

పూర్తి జట్టు..

ఎవిన్ లూయిస్ (Evin Lewis), క్రిస్ లిన్ (Chris Lynn), రస్సీ డస్సెన్ (Russie Dusse, సన్నీ సోహల్ (Sunny Sohal), నిక్ కెల్లీ (Nick Kelly), ఫాబియన్ అలెన్ (Fabian Allen), సొహైల్ తన్వీర్ (Sohail Tanveer), డొమినిక్ డ్రేక్స్ (Dominic Drakes), కొలిన్ ఆర్క్‌బాల్డ్ (Colin Arkbold), ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), దినేష్ రామ్‌దిన్ (Dinesh Ramdin), జహ్మార్ హామిల్టన్ (Jahmar Hamilton), బెన్ డంక్ (Ben Dunk), జాషువా డి సిల్వా (Joshua de Silva), షెల్డన్ కార్టెల్ (Sheldon Cartel), రయాద్ ఎమ్రిత్ ( Rayad Emrit ), అల్జారీ జోసెఫ్ (Aljari Joseph), ఇష్ సోథీ (Ish Sothi), డెన్నిస్ బుల్లీ (Dennis Bully), జాన్ రస్ జగ్గేసార్ (John Russ Jaggesar) ఉన్నారు.

కోచ్: మార్క్ ఓడొనెల్ (Coach: Mark O’Donnell)
యజమాని: సిటీ స్పోర్ట్స్ ‘ప్రభుత్వ కన్సార్టియం’ City Sports (Government Consortium)

హోం గ్రౌండ్: వార్నర్ పార్క్(Home Ground: Warner Park)

Advertisement

Next Story