జక్కన్న షార్ట్ ఫిల్మ్‌లో తారక్, చరణ్?

by Shyam |
జక్కన్న షార్ట్ ఫిల్మ్‌లో తారక్, చరణ్?
X

దిశ, సినిమా : ఇండియన్ సినిమాకు వరల్డ్ స్టాండర్డ్స్ సెట్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రస్తుత ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’‌తో ‘బాహుబలి’ని మించిన ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతుండగా.. అంతకు ముందుగానే ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

బిగ్ స్క్రీన్‌పై ఆయన మ్యాజిక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న క్రమంలో.. పాండమిక్ సమయంలో పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ షార్ట్ ఫిల్మ్ చేసేందుకు ముందుకొచ్చాడు జక్కన్న. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ పోలీసు అధికారులను కలిసి చర్చించిన ఆయన.. త్వరలో దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉంది. 19 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తారక్, చరణ్ కనిపిస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story