- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సృష్టి కాదు.. అక్రమాల పుట్ట
దిశ, ఏపీ బ్యూరో: డెలివరీ ఫ్రీ.. డెలివరీ తరువాత లక్ష లేదా రెండు లక్షల రూపాయలు. కస్టమర్‌తో పాటు బాలింత తీరుపై ఆధారపడి ఉంటుంది ధర.. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ అక్రమాల పుట్టలు తవ్వితే గుట్టలుగుట్టలుగా పాపాలు బయటపడుతున్నాయి. పేదరికం బలహీనతగా మారితే.. ఆ పేదరికాన్ని సొమ్ము చేసుకునే డాక్టర్ల తీరుకు పరాకాష్టగా మారిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్వాకాలు. విశాఖపట్టణంలోని ఆస్పత్రుల హబ్‌గా పేర్కొనే మహారాణిపేటలోని జిల్ల పరిషత్ సెంటర్లో సృష్టి ఆస్పత్రి వెలిసింది. పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతుందన్న ఆరోపణలతో 2018లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా పేరు మార్చుకుంది.
హైదరబాదు, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతా కేంద్రాలుగా బ్రాంచ్‌లు వెలిశాయి. వీటికి పేషంట్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, గంజాం, గజపతి, రాయఘడ, కోరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చే వారు. ఏపీలోని ప్రముఖ వార్తా ఛానెల్లలో ఆమె పెయిడ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేది. వీటిని చూసిన పిల్లలు లేని తల్లిదండ్రులు ఆమెను సంప్రదించేవారు. అక్కడి నుంచి కథమొదలయ్యేది. వారిని వైద్యం పేరిట పలుమార్లు ఆస్పత్రికి తిప్పేది. లాభం లేదని, తానే పిల్లలను అరేంజ్ చేస్తానని, అయితే బాగా ఖర్చవుతుందని చెప్పేది. అప్పటికే పిల్లల కోసం ఆస్పత్రులన్నీ తిరిగి విసిగిపోయిన తల్లిదండ్రులు పిల్లల కోసం భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడేవారుకాదు. దీంతో ఆమె పేషంట్లకు వల వేసేది. పైన చెప్పిన జిల్లాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేది. అక్కడికి వచ్చిన గర్భిణీలకి నిరుపేదలైతే ఉచిత వైద్యం పేరిట ఆకట్టుకునేది.
ఉచిత వైద్యమనగానే పేదలు ఆ ఆస్పత్రికి ఎగబడేవారు. నెలలు నిండుతుండగా వారిని తన హాస్పిటల్‌లో జాయిన్ చేసేది. వారిని జాగ్రత్తగా చూసుకునేది. అన్ని సౌకర్యాలు కల్పించి, సపర్యలు చేయించేది. పూర్తి నమ్మకం కలిగిన తరువాత వారి ఆర్థిక స్తోమతను వారికి వివరిస్తూ, పిల్లలు కూడా పేదరికంలోనే బతకాలా? పెద్దింట్లో బతికితే మీ పిల్లలు కాదా? అంటూ బ్రెయిన్ వాష్ చేసేది. దీంతో తొలుత అంగీకరించని పేద తల్లులు, పిల్లడ్ని ఇచ్చినందుకు లక్ష రూపాయలు చెల్లిస్తామంటూ ఆశచూపేది. అప్పటికే కడు పేదరికం చూసిన ఆ తల్లులు ఆ మొత్తానికి తలవంచేవారు. దీంతో ఆ పిల్లల బర్త్ సర్టిఫికేట్లలో అసలు తల్లిదండ్రుల స్థానంలో కొనుక్కున్న తల్లిదండ్రులు వచ్చి చేరేవారు.
గత ఏడాది కాలంలో కేవలం వైజాగ్‌లోని జిల్లా పరిషత్ ఆస్పత్రిలోనే 56 శిశుజననాలు సంభవించాయంటే పరిస్థితి ఊహించవచ్చు. ఇప్పటి వరకు ఈ సృష్టి కేంద్రం 200కి పైగా పిల్లలను విక్రయించి ఉంటుందని మహారాణిపేట పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 24న ఈ ఆస్పత్రిపై సుందరమ్మ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో పాపాల పుట్టబద్దలైంది. పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల అక్రమ రవాణాలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండి డాక్డర్ నమ్రతదే ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ నమ్రత పరారీలో ఉన్నందున ప్రత్యేక బృందాలు కర్ణాటక వెళ్లి అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వైజాగ్ తరలించారు.
నిన్న రాత్రి 10 గంటలకు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ ఆమెకు డ్యూటీ డాక్టర్ భాను వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో పోలీసులు ఆమెను జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించారు. మరోవైపు ఆమె హైదరాబాదులోని రెండు బ్రాంచ్‌లతో పాటు విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాల్లోని బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహించేందుకు అనుమతి కోరనున్నారు.