- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో లాక్‌డౌన్ ఆలోచన లేదు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ విధించనున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం కాదని, రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించడం లాంటి ఆలోచనలు లేవన్నారు. స్కూళ్లల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. దానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. స్కూళ్ల నిర్వహణపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాసరావు తెలిపారు.
కాగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. విద్యాసంస్ధలను మూసివేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్య విద్యాసంస్థలు మినహా అన్ని విద్యాసంస్థలను రేపటి నుంచి మూసివేస్తున్నట్లు సబితా వెల్లడించారు. ఆన్‌లైన్ క్లాసులు యధావిధిగా జరుగుతాయన్నారు.