- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రం క్షమాపణ చెప్పాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో : గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారు. మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు అని కేంద్ర మంత్రి మాట్లాడటం తెలంగాణను అవమాన పరచడమేనని, తెలంగాణకు కేంద్రం క్షమాపణ చెప్పాలని, రైతులకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీల కోసం వెళతారు.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళ్తామని అన్నారు. అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు. తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పడ్డ కష్టం అందరికీ తెలుసు.. బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పెద్దలతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మా మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
పులి రెండు అడుగులు వెనక్కి వేసినంత మాత్రానా వెనకబడ్డట్టు కాదని వార్నింగ్ ఇచ్చారు. రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, తెలంగాణలో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. యాసంగిలో వరి వేయాలా వద్దా అనేది కేంద్రం స్పష్టంగా చెప్పాలని అన్నారు. కేసీఆర్ మీద కోపంతో, అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణకు క్షమాపణ చెప్పి కేంద్రం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.