బ్రేకింగ్ న్యూస్.. ఎక్సైజ్ ఆఫీసులో శ్రీనివాస్ గౌడ్ మృతి

by Anukaran |
బ్రేకింగ్ న్యూస్.. ఎక్సైజ్ ఆఫీసులో శ్రీనివాస్ గౌడ్ మృతి
X

దిశ, మంచిర్యాల: ఎక్సైజ్ ఆఫీసులో గీత కార్మికుడి మృతి వ్యవహారం కలకలం రేపుతోంది. మండల పరిధి దౌడేపల్లికి చెందిన ఆకుల శ్రీనివాస్ గౌడ్ గుండుంబా తయారు చేస్తున్నాడనే అనుమానంతో అధికారులు ఆదివారం కార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆఫీసులో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. దీంతో అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందినట్టు చెప్పుకొచ్చారు. అధికారుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కుటుంబీకులు.. శ్రీనివాస్‌పై దాడి చేయడంతో మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. రూ. 20 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అర్ధరాత్రి వరకు మృతదేహాన్ని తరలించకపోవడంతో పోలీసులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బాధితులకు నచ్చజెప్పారు. దీంతో అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story