- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్ : నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై వేంచేపు చేసి, మిథున లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా రాత్రి 8 గంటలకు ఆలయంలో పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాతంగా వాహనసేవ జరుగనుంది. ఈనెల 27న చిన్నశేష వాహనం, హంస వాహనం సేవ, 28న సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం సేవ, 29న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం సేవ, 30న మోహినీ అవతారం గరుడ వాహనం, మే 1న హనుమంత వాహనం, గజ వాహనం సేవ,
02న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం సేవ, 03న రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనం, ఆర్జితకల్యాణోత్సవం/అశ్వవాహనం, 04న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 3వ తేదీన సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం ఆలయంలో ఏకాంతంగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నాగరాజ బట్టర్, కంకణ బట్టర్ శ్రీ సాయిక్రిష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నందకుమార్, ఉదయ్‌కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 27న పౌర్ణమి గరుడ సేవ
పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 27న మంగళవారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.