- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా బతుకమ్మ సంబురాలు.. ఆడిపాడిన ఎమ్మెల్సీ కవిత
దిశ, నెల్లికుదురు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద సాంస్కృతిక కళాబృందం హాజరై బతుకమ్మ ఆటపాటలతో హాజరైన వారిని అలరించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా గవర్నర్ తమిళి సై, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు హాజరయ్యారు. వివేకానంద సాంస్కృతిక కళా సమితి బృందం పాడిన ఆటపాటలకు హాజరైన వారందరూ ముగ్ధులయ్యారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బృందంతో కలిసి బతుకమ్మ ఆట పాటలు పాడింది.
కళా సమితి ప్రదర్శనను ఆమె అభినందించింది. అనంతరం రిజిస్ట్రార్ బట్టు రమేష్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణలు మాట్లాడుతూ.. అంతరించిపోతోన్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న జానపద కళాకారులు ఆదూరి కళాధర్ రాజును ప్రత్యేకంగా అభినందించారు. వివేకానంద సాంస్కృతిక సమితిని సైతం అభినందిస్తూ.. డాక్టర్ కళాధర్ రాజును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్తంగా శాలువాతో సన్మానించారు. బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న జానపద కళాకారులందరినీ తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, విశ్వవిద్యాలయం అధ్యక్షులు రసమయి బాలకిషన్ చీర సారెలతో, నగదు పారితోషికంతో సత్కరించారు.