బ్రేకింగ్ : శ్రీరామ నవమి వేడుకలు రద్దు

by Anukaran |   ( Updated:2021-04-20 05:14:29.0  )
బ్రేకింగ్ : శ్రీరామ నవమి వేడుకలు రద్దు
X

దిశ, బోథ్: దేశమంతటా కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటీకే రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి వేడుకలు రద్దు చేశారు. కరోనా కారణంగా శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్ర ర్యాలీ ని నిర్వహించడం లేదని భజరంగ్ దళ్ నాయకుడు పాలిక్ రమేష్ తెలిపారు. హిందు బంధువులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలని, ప్రతి ఒక్కరు తమ ఇంటి దగ్గర శ్రీరాముని చిత్రపటానికి పూజ చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ కరోనా కట్టడికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఎచ్ పి నాయకులు అంజన రాము, ద్యాగల వంశీ, వేముల కిష్టయ్య, ఇప్ప లక్ష్మన్, కట్కురి సాయి, రాజశేఖర్, కున రాము, గంగాజి నిఖిల్, దాసరి విజయ్ కుమార్, చిలుక మహేష్ తదితరులు పాల్గోన్నారు

Advertisement

Next Story