- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
కొలంబో: ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించాలని శ్రీలంక ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నది. ఈ మేరకు శ్రీలంకలో పబ్లిక్ సెక్యూరిటీ మినిస్టర్‌గా ఉన్న సరత్ వీరశేఖర కొలంబోలో ఈ వివరాలను వెల్లడించారు. వీరశేఖర మాట్లాడుతూ.. గతంలో శ్రీలంకలో ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించేవారు కాదనీ, కానీ ఇప్పుడది ఎక్కువైందని అన్నారు. ఇది మత అతివాదానికి ప్రతీక అని అన్నారు. ఈ నేపథ్యంలో బుర్ఖాపై త్వరలోనే శాశ్వత నిషేధం విధించనున్నట్టు తెలిపారు. ఆ మేరకు బిల్లును రూపొందించామనీ, దానిపై తాను సంతకం కూడా చేశానని చెప్పారు. ప్రతిపాదిత బిల్లును ఆమోదం నిమిత్తం క్యాబినెట్ ముందుకు పంపామనీ, త్వరలోనే దీనిని ఆమెదిస్తామని అన్నారు. 2019లో శ్రీలంక రాజధాని కొలంబోలో మూడు చర్చిలు, హోటళ్ల మీద ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 250కి పైగా మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకుని బుర్ఖాలపై నిషేధం విధించనున్నట్టు వీరశేఖర తెలిపారు.
బుర్ఖా నిషేధంతో పాటు మదర్సాలపై కూడా అక్కడి ప్రభుత్వం కొరడా విధించనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న మదర్సాలు దేశ విద్యా విధానాన్ని ఉల్లంఘిస్తున్నాయని వీరశేఖర ఆరోపించారు. ఎవరికి నచ్చినట్టు వారు పాఠశాలలు పెట్టుకుని వారికి నచ్చింది బోధించుకుంటామంటే కుదరదని హెచ్చరించారు. శ్రీలంక ప్రభుత్వ తాజా నిర్ణయం అక్కడి ముస్లిముల (మొత్తం జనాభాలో 9. శాతం)పై ప్రభావం చూపనున్నది.