- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌కు ఆలస్యంగా రానున్న శ్రీలంక ప్లేయర్లు
దిశ, స్పోర్ట్స్: యూఏఈలో జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు శ్రీలంక క్రికెటర్లు వారంరోజులు ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. ప్రస్తుత సీజన్‌లో శ్రీలంక నుంచి లసిత్ మలింగ, ఇరుసు ఉదాన మాత్రమే ఐపీఎల్‌లో ఆడుతున్నారు. మలింగ ముంబై ఇండియన్స్ తరఫున, ఉదాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, ఐపీఎల్‌కు ముందు ఆటగాళ్లందరికీ కొవిడ్ టెస్టులు తప్పని సరి. అంతేకాకుండా వాళ్లు బయోబబుల్‌లోకి ప్రవేశించాక తిరిగి మ్యాచ్‌లన్నీ ముగిసిన తర్వాతే బయటకు అనుమతిస్తారు. అయితే, శ్రీలంక బోర్డు నిర్వహిస్తున్న లంకన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ 20న జరగనుంది. దీంతో వీరిద్దరూ వెంటనే ఐపీఎల్‌లో ఆడలేకపోవచ్చు. ఎల్‌పీఎల్ ముగిసిన తర్వాత 72గంటల పాటు ఐసోలేషన్‌లో ఉండి, ఆ తర్వాత వారికి నిర్వహించే కొవిడ్ 19 పరీక్షల్లో నెగటివ్ వస్తేనే తమ ఫ్రాంచైజీలతో కలిసే అవకాశం ఉంది. దీనికి కనీసం వారంరోజుల సమయం పడుతుంది. అంటే ఐపీఎల్ ప్రారంభమైన 7 నుంచి 9రోజుల తర్వాత గానీ వీళ్లు జట్టుతో కలవలేరని శ్రీలంక బోర్డు తెలిపింది.