- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో 30 పరుగులైతే గెలిచే వాళ్లం: మాథ్యూస్
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక, భారత్‌కు మధ్య జరిగిన 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో తాము మరో 30పరుగులు చేసుంటే తప్పకుండా గెలిచేవాళ్లమని లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. లక్ష్య ఛేదనలో ఆదిలోనే టీం ఇండియా సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోవడంతో మేం సరైన స్కోరే చేశామని భావించామని అన్నాడు. కష్టాల్లో ఉన్న జట్టును ముందు కోహ్లి-గంభీర్‌లు ఆదుకోగా, ఆ తర్వాత ధోనీ విజయం వైపు నడిపించాడని గుర్తుచేశారు. ఓ యూట్యూబ్ చానల్‌తో మాథ్యూస్ మాట్లాడుతూ.. ‘అది నా తొలి వన్డే ప్రపంచకప్. అప్పటికే నేను 2009, 2010 టీ20 ప్రపంచకప్‌లు ఆడాను. కానీ, 2011 వరల్డ్‌కప్ మాత్రం ప్రత్యేకం. మేము ఫైనల్ వరకు అద్భుతంగా ఆడాం. ఫైనల్లోనూ బాగానే ఆడాం. ఫైనల్ మ్యాచ్‌కు ముందు నేను గాయపడ్డా. అదే నన్ను తీవ్రంగా బాధించింది. ఆ ఫైనల్స్‌లో మరో 30 పరుగులు చేసుంటే భారత జట్టుకు గట్టి పోటీని ఇచ్చే వాళ్లం’ అని అన్నాడు.