మరోసారి రాజుకోనున్న భారత్- శ్రీ లంక వివాదం..?

by Anukaran |
మరోసారి రాజుకోనున్న భారత్- శ్రీ లంక వివాదం..?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ లంక తో మరోసరి వివాదం రాజుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేపల వేటకోసం వెళ్లిన జాలర్లు పొరపాటున అంతర్జాతీయ సరిహద్దులు దాటి శ్రీ లంక జలాల్లోకి వెళ్లిపోయారు. వెంటనే అలెర్ట్ అయిన లంక సిబ్బంది మన జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 43 మంది ని అరెస్ట్ చేసి 6 పడవలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక తీరంలోని కంగెసంతురాయ్ శిబిరానికి వారిని తీసుకువెళ్లినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

లంక సైన్యం అరెస్ట్ చేసిన మత్య్సకారులను విడుదల చేయాలని భారత మత్య్సకారుల సంఘం డిమాండ్ చేసింది. తమిళనాడు నుంచి దాదాపు 500 మంది మత్స్యకారులు వేటకై సముద్రం లోకి వెళ్లారు. అందులో 43 ముంది అరెస్ట్ కాగా మిగిలిన వారు భారత్ చేరుకున్నారు. శ్రీలంక ప్రభుత్వం తో మాట్లాడి మత్స్యకారులను వెంటనే విడిపించాలని ఎంపీ కే నవస్ కని కేంద్ర మంత్రులను కోరారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, తమిళ మత్స్య సంఘం ప్రకటించింది. భారత ప్రభుత్వం త్వరగా కలగజేసుకోక పోతే మరో సారీ కేంద్రం తమిళుల ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed