- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఐపీఎల్ నిర్వహించేందుకు మాకు ఛాన్స్ ఇవ్వండి'
ఐపీఎల్ కూడా కరోనా మహమ్మారి ఖాతాలోకి చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి అయితేనే గానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించబోమని.. అప్పటిదాకా నిరవధికంగా వాయిదా వేస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా, వాయిదా పడ్డ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం తమ దేశంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదని.. దేశం మొత్తం మీద కేవలం 200 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని బోర్డు పేర్కొంది. శ్రీలంక ప్రభుత్వం కూడా ఐపీఎల్ నిర్వహిస్తే తగిన తోడ్పాటునందిస్తుందని లంక బోర్డు తెలియజేసింది. తమ వద్ద అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు ఉండటంతో పాటు అనేక మంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసింది. గతంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించినట్లే ఈసారి శ్రీలంకలో ఐపీఎల్ ఆడించమని కోరింది. కాగా, శ్రీలంక బోర్డు ప్రతిపాదనపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.
Tags : IPL, Srilanka Cricket Board, BCCI, Corona, Fans