- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ పోస్టర్లతో అదరగొడుతున్న సన్‌రైజర్స్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఏ సీజన్ చూసిన అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టును క్రికెట్ అభిమానులకే కాకుండా తమిళ ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో యాజమాన్యం ఎన్నో పద్దతులను అనుసరించింది. సీఎస్కే జట్టును ప్రమోట్ చేయడానికి కోలీవుడ్ యాక్టర్లతో ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. ‘విజిల్ పోడు’ అంటూ తమిళనాడులో భారీ ప్రమోషన్లు చేయడంతో ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్‌ను ప్రమోట్ చేయడంలో సన్ నెట్‌వర్క్ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి.
గతంలో కొన్ని ఫ్యాన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సారి టాలీవుడ్ సినిమాలను నమ్ముకున్నది. టాలీవుడ్‌లో హిట్టయిన సినిమా పోస్టర్లతో క్రికెటర్ల ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అదరగొడుతున్న ఈ పోస్టర్లను చూసి ఫ్యాన్స్ మస్త్ కుషీ అవుతున్నారు. ‘భరత్ అనే నేను’ పోస్టర్‌ను ‘కేన్ అనే నేను’గా మార్చారు. మనీష్ పాండేను ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్‌గా, భువనేశ్వర్ కుమార్‌ను ‘శ్రీమంతుడు’గా, అబ్దుల్ సమద్‌ను ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’గా మార్చి పోస్టర్లు విడుదల చేశారు. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది.