భారీ విరాళం ప్రకటించిన 'సన్‌రైజర్స్'

by Shyam |
భారీ విరాళం ప్రకటించిన సన్‌రైజర్స్
X

కరోనాపై పోరాటానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన ‘సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తమ వంతు సాయాన్ని అందించింది. సన్ గ్రూప్‌కు చెందిన ఈ ఫ్రాంచైజీ కరోనా నివారణ చర్యల కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే, ఈ విరాళాన్ని ఏ సహాయ నిధికి ఇస్తున్నారో వివరాలు మాత్రం వెల్లడించలేదు. సన్ రైజర్స్ జట్టు తెలంగాణలోని హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఆ జట్టు యాజమాన్యం మాత్రం చెన్నైకు చెందిన వాళ్లు. దీంతో వాళ్లు ఎవరికి విరాళం ఇచ్చేరనేదానిపై స్పష్టత లేదు. అయితే, తమ ఫ్రాంచైజీ కరోనాపై పోరాటానికి సాయం అందించడాన్ని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభినందించాడు. కరోనాపై పోరాటానికి సన్ గ్రూప్ తోడ్పాటుపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు.

Tags: Sunrisers, Donation, Corona, Hyderabad, David warner, Sun Group

Advertisement

Next Story