ఐపీఎల్ వేలం నుంచి తప్పించడంపై శ్రీశాంత్ స్పందన

by Shiva |
ఐపీఎల్ వేలం నుంచి తప్పించడంపై శ్రీశాంత్ స్పందన
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్ పేరు లేకపోవడంపై అతడు స్పందించాడు. ‘తనను ఎంపిక చేయకపోవడంపై బాధగా ఉన్నది. కానీ ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. నాకింకా 38 ఏళ్లే. క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉన్నది. మరి కొన్నేళ్లు నేను క్రికెట్‌ను విడిచిపెట్టేది లేదు. మరింత ఎక్కువగా కష్టపడి వచ్చే ఏడాది చోటు సంపాదించడానికి ప్రయత్నిస్తా. తాను దేనినీ అంత తేలికగా తీసుకోను. నాకు కావల్సింది దక్కే వరకు కష్టపడతా. ఏదైనా అద్భుతం జరిగి అవకాశం వస్తే మాత్రం వదులుకోను. గేల్ వంటి క్రికెటర్‌నే గతంలో జరిగిన వేలంలో కొనుగోలు చేయలేదు. కానీ ఇప్పుడు అతడి కోసం ఎన్నో జట్లు వేచి చూస్తున్నాయి’ అని శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ నిషేధం ముగిసిన తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టు తరఫున ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed