- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పుత్నిక్ వీ ట్రయల్స్ ప్రారంభం..
న్యూఢిల్లీ : రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా రెండు, మూడో దశ ట్రయల్స్ భారత్‌లో ప్రారంభించినట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ లిమిటెడ్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)లు ప్రకటించాయి. సెంట్రల్ డ్రగ్స్ ల్యాబరేటరీ నుంచి అనుమతులు పొందిన తర్వాత ట్రయల్స్ ప్రారంభించినట్టు వివరించాయి. క్లినికల్ రీసెర్చ్ భాగస్వామి అయిన జేఎస్ఎస్ మెడికల్ రీసెర్చ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నదని తెలిపాయి.
క్లినికల్ ట్రయల్స్ సెంటర్‌లు, అడ్వైజరీ సపోర్ట్ కోసం బయోటెక్నాలజీ శాఖకు చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వివరించింది. భారత్‌లో ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని అనుసరించి టీకాను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో కీలక అడుగుపడిందని, విదేశీ, దేశీయ ప్రొడక్షన్ మోడల్‌లో టీకాను ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్టు పేర్కొంది.