Paris olympics : ఆ క్రీడలో చైనాకు తొలి స్వర్ణం.. ఏళ్ల నిరీక్షణకు తెర

by Harish |
Paris olympics : ఆ క్రీడలో చైనాకు తొలి స్వర్ణం.. ఏళ్ల నిరీక్షణకు తెర
X

దిశ, స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌ అంటే చైనా అథ్లెట్లు ఏ విధంగా రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పతకాల పంట పండిస్తారు. పారిస్ విశ్వక్రీడల్లో కూడా చైనా 36 పతకాలతో అగ్రస్థానంలో ఉన్నది. అయితే, ఓ క్రీడా అంశంలో మాత్రం చైనా స్వర్ణం కోసం ఏళ్లుగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ ఈవెంటే టెన్నిస్ సింగిల్స్. తాజాగా చైనా నిరీక్షణకు తెరపడింది. మహిళల సింగిల్స్‌లో క్వినెన్ విజేతగా నిలిచి చైనాకు తొలి స్వర్ణ పతకం అందించింది. శనివారం జరిగిన ఫైనల్‌లో జెంగ్ 6-2, 6-3 తేడాతో క్రొయేషియాకు చెందిన వెకిక్ డొన్నాను ఓడించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన జెంగ్ వరుస సెట్లను దక్కించుకుని చాంపియన్‌గా నిలిచింది. దీంతో టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి చైనా క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో టెన్నిస్ విభాగంలో చైనాకు ఇది రెండో గోల్డ్ మెడల్. మొత్తంగా 4వ పతకం. 2004 విశ్వక్రీడల్లో ఉమెన్స్ డబుల్స్‌లో లీ టింగ్-సన్ టియాంటిన్ తొలి బంగారు పతకం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed