WTC Final 2023: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. యువ వికెట్‌ కీపర్‌‌కు ప్రాక్టీస్ సెషన్‌లో గాయం!

by Vinod kumar |
WTC Final 2023: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. యువ వికెట్‌ కీపర్‌‌కు ప్రాక్టీస్ సెషన్‌లో గాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023 మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్‌ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ వేదికగా జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, భారత జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత జట్టు యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా బంతి కిషన్‌ చేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన కిషన్‌ తర్వాతి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో గాయం కారణంగా జట్టు సెలక్షన్‌కు కిషన్‌ అందుబాటులో లేకపోతే.. భరత్‌కు చోటు ఖాయమైనట్లే.

Advertisement

Next Story