WTC ఫైనల్: నేడు లండన్‌‌ వెళ్లనున్న కెప్టెన్ రోహిత్

by Mahesh |   ( Updated:2023-05-27 14:26:30.0  )
WTC ఫైనల్: నేడు లండన్‌‌ వెళ్లనున్న కెప్టెన్ రోహిత్
X

ముంబై : ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరు కోసం ఇప్పటికే భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ లండన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్, యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ నేడు లండన్‌ బయల్దేరనున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ సారథిగా ఉండగా.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఐపీఎల్-16 క్వాలిఫయర్-2లోనే ముంబై ఇంటిదారి పట్టింది. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఈ ముగ్గురు ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు.

గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఇషాన్ కిషన్‌ కంటికి గాయమైంది. అతని గాయం తీవ్రతపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ క్రమంలో అతను ఫైనల్ ఆడతాడా? లేదా? అన్నది అనుమానాలు నెలకొన్నాయి. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఓవల్ స్టేడియంలో డబ్ల్యూ టీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ టైటిల్ పోరులో నేడు చెన్నై, గుజరాత్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ లండన్ వెళ్లనున్నారు.

Also Read..

బౌలింగ్ ప్రాక్టీస్‌కు సిద్దమైన బుమ్రా..?

Advertisement

Next Story