ఆసీస్‌కు అదే కలిసొచ్చింది.. WTC Final ఓటమిపై రోహిత్‌ శర్మ

by Vinod kumar |
ఆసీస్‌కు అదే కలిసొచ్చింది.. WTC Final ఓటమిపై రోహిత్‌ శర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2021-23లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ విజేతగా అవతరించింది. సగర్వంగా ఐసీసీ గదను సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. 'టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొని అందుకు అనుగుణంగా మా బౌలర్లు ఆట తొలిరోజు మొదటి సెషన్‌లో బాగా బౌలింగ్ చేశారు. కానీ తర్వాతి సెషన్‌ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని' అని రోహిత్ శర్మ తెలిపారు.

అయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులతోనే సగం విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో వారిని తొందరగా ఔట్‌ చేయాలనుకున్నాం. అందులో దాదాపు సక్సెస్‌ అయ్యాం. కానీ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యం వాళ్లకు కలిసొచ్చింది.. అదే మా కొంపముంచింది. మా బ్యాటింగ్‌ విభాగం బాగానే ఉందనుకుంటున్నా. కీలక సమయంలో ఆడడంలో విఫలమయ్యామని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed