- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్ జెయింట్స్‌కు షాక్.. రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్ దూరం
దిశ, స్పోర్ట్స్ :ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు భారత క్రికెటర్లు కాశ్వీ గౌతమ్, కనిక ఆహుజ దూరమయ్యారు. గాయం కారణంగా వీరిద్దరూ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. కాశ్వీ గౌతమ్ గుజరాత్ జెయింట్స్‌కు, కనిక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి స్థానాలను రెండు ఫ్రాంచైజీలు సోమవారం భర్తీ చేశాయి. కాశ్వీ గౌతమ్ స్థానంలో ముంబైకి చెందిన సయాలీ సత్‌గారేను గుజరాత్ జెయింట్స్ జట్టులోకి తీసుకుంది. రూ. 10 లక్షల కనీస ధరకు ఆమెతో ఒప్పందం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ వేలంలో కాశ్వీ గౌతమ్‌ను గుజరాత్ రూ.2 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కనిక స్థానాన్ని మహారాష్ట్ర బౌలర్ శ్రద్ధా ఫోఖార్కర్ భర్తీ చేసింది. ఆమెను ఆర్సీబీ రూ. 10 లక్షలకు జట్టులోకి తీసుకుంది. కాగా, ఈ నెల 23 నుంచి డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ప్రారంభంకానుంది.