- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా ఆదివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్స్‌లో 25 ఏళ్ల నీరజ్ చోప్రా.. జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి అదరగొట్టాడు. ఈ గెలుపుతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ రజత పతకంతో సరి పెట్టుకున్నాడు. ఈ సందర్బంగా నీరజ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచిన నీరజ్ చోప్రాకు 70 వేల డాలర్లు (సుమారు రూ. 58 లక్షలు) నగదు బహుమతిని అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండోస్థానంలో ఉన్న అర్షద్ నదీమ్ 35000 డాలర్లు (సుమారు రూ. 29 లక్షలు) ప్రైజ్ మనీని గెలుచు కున్నాడు. కాగా 40 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూఏసీ) చరిత్రలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా.