క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టేడియాల్లో ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ

by Harish |
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టేడియాల్లో ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 19 నుంచి శ్రీలంక వేదికగా మహిళల ఆసియా కప్ మొదలుకానుంది. టోర్నీలో జరిగే 15 మ్యాచ్‌లకూ దంబుల్లానే ఆతిథ్యమిస్తున్నది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని అంతర్జాతీయ బ్రాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని పేర్కొంది.

శ్రీలంక క్రికెట్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా శ్రీలంక మాజీ క్రికెటర్ రవిన్ విక్రమరత్నేను ఆసియా కప్ టోర్నీ డైరెక్టర్‌గా నియమించినట్టు తెలిపింది. ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్ మద్దతుతో శ్రీలంక క్రికెట్ టోర్నీని విజయవంతంగా నిర్వహించాలనుకుంటున్నది. ఈ టోర్నీ విజయవంతమైన ఫలితం ప్రపంచ వేదికపై మహిళల క్రికెట్ ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.’ అని రవిన్ విక్రమరత్నే తెలిపారు. కాగా, టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ఈ నెల 19న నేపాల్, యూఏఈ మ్యాచ్‌తో మొదలుకానుంది. అదే రోజు రాత్రి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed