- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్
దిశ, వెబ్ డెస్క్ : 2025 మహిళల అండర్-౧౯ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మలేషియా అతిధ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ... జనవరి 18 నుండి ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా.. మొత్తం 41 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ప్రతి గ్రూప్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ లోని రెండు గ్రూపుల్లో టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుతాయి. గ్రూప్-ఏ లో భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేషియా ఉండగా.., గ్రూప్-బీ లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ ఉన్నాయి. గ్రూప్-సీ లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా. గ్రూప్-డీ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ ఉన్నాయి. కాగా ఈ టోర్నీ వార్మ్ అప్ మ్యాచ్ లు జనవరి 13 నుండి 16 వరకు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 1న జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 3న జరుగుతుంది.